హోటళ్లలో పెరగనున్న టిఫిన్, భోజన ధరలు

58చూసినవారు
హోటళ్లలో పెరగనున్న టిఫిన్, భోజన ధరలు
నిత్యావసరాలు, గ్యాస్, పాల ధరలు భారీగా పెరగడంతో హోటల్ యాజమాన్యాలు మెనూ ధరలను 5 నుండి 10 శాతం వరకు పెంచాలని నిర్ణయించాయి. బియ్యం, పప్పులు, నూనె ధరలు 15-20 శాతం పెరగడం, నెయ్యి, వెన్న ధరలు కేజీకి రూ.150 పెరగడం దీనికి ప్రధాన కారణం. ఈ మార్పుల వల్ల గతంలో రూ.100 ఉన్న ధరలు రూ.105-రూ.110కి చేరనున్నాయి. కొన్ని హోటళ్లు ధరలు పెంచే బదులు, వంటకాల పరిమాణాన్ని తగ్గించడం లేదా కొన్ని ఐటమ్స్ ను మెనూ నుండి తొలగించడం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్