ఆవు, రెండు లేగ దూడలను చంపిన పెద్దపులి (వీడియో)

4చూసినవారు
AP: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొత్తూరులో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. చిగురు మామిడి బీట్ పరిధిలోని అడవుల్లో పెద్దపులి తిరుగుతోంది. కొత్తూరు గ్రామానికి సమీపంలో ఆవు, రెండు దూడలపై దాడి చేసింది. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్