ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ష్రాఫ్ సురక్షితంగా బయటపడగా, కారు డ్రైవర్ ఫిర్దౌస్, ఆటో డ్రైవర్ చౌహాన్లకు గాయాలయ్యాయి. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. ఇక క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు సోషల్ మీడియాలో సమాచారం వైరల్ అవుతోంది.