ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా టిక్‌టాక్‌ వ్యవస్థాపకుడు

1చూసినవారు
ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా టిక్‌టాక్‌ వ్యవస్థాపకుడు
ఆసియాలో అత్యంత సంపన్నుడిగా టిక్‌టాక్‌ వ్యవస్థాపకుడు జాంగ్‌ యిమింగ్‌ నిలిచారు. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ఆయన సంపద 105 బిలియన్‌ డాలర్లకు పైగా ఉంది. దీంతో గౌతమ్‌ అదానీని వెనక్కి నెట్టి జాంగ్‌ తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. అదానీ, ముకేశ్‌ అంబానీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బైట్‌డాన్స్‌ ఏఐ రంగంలో వేగంగా విస్తరించడం, డౌబావో ఏఐ చాట్‌బాట్‌, సీడాన్స్‌ వీడియో మోడళ్ల వృద్ధితో జాంగ్‌ సంపద భారీగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ఈ నెలలోనే ఆయన సంపద 12 బిలియన్‌ డాలర్లకు పైగా పెరిగింది.

సంబంధిత పోస్ట్