
కరెంట్ షాక్ తగిలి బాలిక మృతి
TG: విద్యుత్ షాక్ తగిలి ఓ బాలిక మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ పట్టణ శివారులోని గడ్డిగూడెం తండాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన ధారావత్ కీర్తిక మంగళవారం ఉదయం విద్యుత్ షాక్కు గురైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలిక మృతికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




