దేశవ్యాప్తంగా ప్రజలు శుక్రవారం నాడు భక్తిశ్రద్ధలతో ధన త్రయోదశి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. దీపావళి ఐదు రోజుల ఉత్సవాలలో ఇది మొదటి రోజు. ఈ పవిత్ర దినాన భక్తులు సంపదకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి, కుబేరుడు, ఆరోగ్య ప్రదాత ధన్వంతరిని పూజిస్తారు. బంగారం, వెండి వస్తువులు, కొత్త పాత్రలు కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదమని భక్తులు భావిస్తారు. సాయంత్రం ప్రదోష కాలంలో లక్ష్మీ పూజతో పాటు, అపమృత్యు దోషాల నివారణ కోసం యమ దీపాన్ని వెలిగించడం ఒక ముఖ్యమైన ఆనవాయితీగా కొనసాగుతోంది.