ఇవాళ ‘సద్దుల బతుకమ్మ’

3చూసినవారు
ఇవాళ ‘సద్దుల బతుకమ్మ’
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన ఆడబిడ్డల పూల పండుగ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ఘనంగా ముగియనున్నాయి. ఈ సంబురాల కోసం ప్రభుత్వం రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, ప్రత్యేక ఘాట్లను సిద్ధం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు వైభవంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేదికను విద్యుద్దీపాలు, తోరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పేలా ఈ ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్