నేటి రాశి ఫలాలు (19-10-2026)

13చూసినవారు
నేటి రాశి ఫలాలు (19-10-2026)
మేషం: వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు కష్టసాద్యంతో పూర్తవుతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో మాటపట్టింపులు తప్పవు. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి.         

వృషభం: సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. అవసరానికి ఇతురుల నుండి ధన సహాయం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశలు అందుతాయి.        

మిధునం: నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గంధరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.          

కర్కాటకం: సంతాన విద్యా ఉద్యోగ విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన విధంగా రాణిస్తారు. సంఘంలో  గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.  

సింహం: ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.      

కన్య: సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. గృహమున సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. ముఖ్యమైన పనులు బంధుమిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు.       

తుల: ఉద్యోగమున చాలాకాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఇంటాబయటా అనుకూల వాతావరణం  ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. బంధువులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.         

వృశ్చికం: ఒక వ్యవహారంలో ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమౌతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.         

ధనస్సు: వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు అతి కష్టం మీద అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమౌతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కొన్ని వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.            

మకరం: ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.           

కుంభం: బంధు మిత్రులతో  సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలలో  శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక  ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి  ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.                 

మీనం: నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంత బందు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. కీలక సమయంలో మంచి ఆలోచనా జ్ఞానంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్