
ట్రైన్ నుంచి తోసి చంపిన సైకో కిల్లర్ అరెస్ట్ (వీడియో)
హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్న నితిన్ కుమార్ (21) అనే యువకుడిని రైలు నుంచి తోసి చంపిన నకిలీ ఆర్పీఎఫ్ అధికారి రోహిత్ తివారీని వారణాసి పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేశారు. తాను ఆర్పీఎఫ్ అధికారిగా చెప్పుకుంటూ ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసేవాడని, ఇవ్వని వారిని రైలు నుంచి తోసి చంపేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడికి గతంలోనూ నేర చరిత్ర ఉందని, 25 నెలల జైలు శిక్ష కూడా అనుభవించాడని వెల్లడించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా 24 గంటల్లో నిందితుడిని పట్టుకున్నారు.




