కాశ్మీర్లోని దాల్ సరస్సులో పర్యాటకులు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఒక మహిళ తన కుమారుడితో పడవలో ప్రయాణిస్తుండగా, పడవలోకి నీరు చేరి మునిగిపోయే స్థితికి చేరుకుంది. భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తున్నప్పటికీ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స్పీడ్ బోట్ సహాయంతో సాహసోపేతంగా వెళ్లి పర్యాటకులను రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.