TG: నిజామాబాద్ జిల్లా కంజర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మోపాల్ మండలం కంజర్ బ్రిడ్జి వద్ద ఓ బైక్ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో కోటగల్లికి చెందిన మనోజ్ (46), రాజు (36) అక్కడికక్కడే మృతిచెందారు. రాత్రి కులాస్పూర్లో విందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.