మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లా దివేగర్ బీచ్‌లో గురువారం విషాదం చోటుచేసుకుంది. పిక్నిక్‌కు వెళ్లిన ఎనిమిది మంది
విద్యార్థులు సముద్రంలో మునిగి మృతి చెందారు. వారి మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. పుణెలోని ఓ ప్రైవేటు కోచింగ్ అకాడమీకి చెందిన 11, 12 తరగతుల 42 మంది
విద్యార్థులు, ఆరుగురు ఉపాధ్యాయులు కలిసి బీచ్‌కు వచ్చారు. ఈ క్రమంలో కొందరు
విద్యార్థులు ఈత కొట్టేందుకు సముద్రంలోకి దిగారు. లోతును అంచనా వేయలేక ఎనిమిది మంది నీట మునిగినట్లు పోలీసులు తెలిపారు.