TG: కారులో ఊపిరాడక చిన్నారి మృతి చెందిన విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం(D) జూలూరుపాడు(M) వినోబా నగర్ లో ఆదివారం జరిగింది. సర్పంచి గంగావత్ నవీన్కు ఇద్దరు పిల్లలు ఉండగా.. పెద్ద కుమార్తె తన్విశ్రీ (4) ఇంటి వద్ద ఆడుకుంటూ కారు ఎక్కింది. డోర్ లాక్ అవడంతో అందులోనే ఉండిపోయింది. కుటుంబ సభ్యులు చిన్నారి కనిపించడం లేదని గాలించి దాదాపు 2 గంటల తర్వాత కారులో చూడగా ముందు భాగంలోనే రెండు సీట్ల మధ్యలో పడిపోయి ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.