AP: అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం జి.కొత్తపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. జజిమొగ్గల శివలక్ష్మి అనే విద్యార్థిని పాఠశాల గదిలో ఉరేసుకుని మృతిచెందింది. చేతిపై మృతికి గల కారణాలను రాసినట్లు సమాచారం. గతంలోనూ ఆమె విషపూరిత పదార్థం తీసుకునేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.