AP: విజయనగరం జిల్లా గరివిడి మండలం వి.పి. రేగ గ్రామంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గెడ్డలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులను ఎర్రవెల్లి హర్ష (4), ధనుష్ (5)గా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు చేపడుతున్నారు.