టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్
ఇండియా (ట్రాయ్) వినియోగదారులకు శుభవార్త తెలిపింది. టెలికాం సంస్థలు తమ యాప్‌లు, వెబ్‌సైట్‌లలో తక్కువ ధర కలిగిన రీఛార్జ్ ప్లాన్లను వెతకడం కష్టతరంగా మారుతోందనే ఫిర్యాదులపై ట్రాయ్ స్పందించింది. ఇకపై ప్రతి యాప్‌లో 'TRAI-Mandated Packs' పేరుతో ప్రత్యేక ట్యాబ్ ఏర్పాటు చేసి, అందులో చౌకైన ప్లాన్లను మొదట ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ మార్పులను 30 రోజుల్లోగా అమలు చేసి నివేదిక సమర్పించాలని సంస్థలకు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో సామాన్య వినియోగదారులకు ఊరట కలగనుంది.