స్పెయిన్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చి బలంగా ఢీకొన్న ఘటనలో ఇప్పటివరకు 65 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో రెండు రైళ్లలో కలిపి 500 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని సమాచారం. రైళ్లు బలంగా ఢీకొనడంతో పలు బోగీలు పట్టాలు తప్పి పూర్తిగా ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతుండగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.