అస్సాంలో రైలు ప్రమాదం.. పలువురికి గాయాలు

16చూసినవారు
అస్సాంలోని కామరూప్ మెట్రో జిల్లా డిగారూ వద్ద బుధవారం సైరంగ్ ఎక్స్ ప్రెస్ (13126) రైలు ప్రమాదానికి గురైంది. కోల్ కతా వెళ్తున్న ఈ రైలు ఏడు బోగీలు పట్టాలు తప్పడంతో ఆందోళన నెలకొంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రయాణికులు గాయపడగా, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పట్టాలు దెబ్బతినడంతో తూర్పు అస్సాం, బరాక్ వ్యాలీ, పరిసర ఈశాన్య రాష్ట్రాలకు రాకపోకలు సాగించే రైలు సర్వీసులను రైల్వే అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్