రైలు ప్రమాదం.. కారణం ఇదేనా(వీడియో)

0చూసినవారు
అసోంలోని కామరూప్‌ జిల్లాలోని డిగార్‌ స్టేషన్‌ వద్ద రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌కతా-సైరంగ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌ సహా ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. రైలు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో రైలు వేగాన్ని లోకో పైలట్ నియంత్రించలేకపోవడం వల్లనే రైలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారుల దర్యాప్తులో వెల్లడి కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్