రైళ్లు ఢీ.. స్పెయిన్‌లో 68 మంది మృతి!

12చూసినవారు
స్పెయిన్‌లో మాడ్రిడ్ నుండి సెవిల్లెకు వెళ్లే మార్గంలో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 68 మంది మరణించారు. ఉదయం 8:53 గంటలకు రెన్ఫే రైలు, పట్టాలపై నిలిచివున్న ఇరియో రైలును బలంగా ఢీకొట్టింది. సిగ్నలింగ్ వ్యవస్థ విఫలమవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే మంత్రి ఆస్కార్ పుయెంటె తెలిపారు. ఉదయం 8:30 గంటలకు సాంకేతిక సమస్య తలెత్తగా, నియంత్రణ విభాగం ఆదేశాలతో రైలు వేగంగా ప్రయాణించి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రైలు 200 కి.మీ వేగంతో ప్రయాణించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్