AP: ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జరుగుమల్లి కేజీబీవీ విద్యార్థినులను వంట మనిషి ట్రాప్ చేసింది. విద్యార్థినులకు మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి అప్పగించింది. విద్యార్థినులతో ఇంట్లో ఉన్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో భయంతో విద్యార్థినులు బయటకు పరిగెత్తి స్థానికులకు చెప్పారు. నిందితుడి ఇంటిపై విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు దాడి చేశాడు. నిందితుడు డీఆర్డీఏలో పనిచేసి రిటైర్ అయిన వెంకటేశ్గా గుర్తించారు. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.