హీరోయిన్లు కత్రినా కైఫ్, కృతిసనన్‌లపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్‌పై నటి మృణాల్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా రంగానికి కత్రినా, కృతి చేసిన సేవలను కొనియాడుతూ, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అనవసర విమర్శలు చేయడం సరికాదని మృణాల్ అన్నారు. మహిళలే కాకుండా నేడు అందరూ ఇలాంటి ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారని, ఎవరి జీవితాలను వారు స్వేచ్ఛగా జీవించాలని, ఇతరులను విమర్శించడం మానుకోవాలని ఆమె కోరారు.