వోల్వో బస్సును ఢీ కొట్టిన ట్రక్‌.. నలుగురు మృతి (వీడియో)

30చూసినవారు
యూపీలోని అంబేద్కర్ నగర్ జిల్లా గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఢిల్లీ నుంచి బీహార్‌కు బయల్దేరిన వోల్వో బస్సును ఎదురుగా వచ్చిన ట్రక్ బలంగా ఢీకొంది, బస్సు ముందు, ఎడమ వైపు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు స్పాట్‌కు చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్