ఫ్రాన్స్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. హృదయాల్లో ద్వేషం నింపుకున్న వలసదారులే ఈ విధ్వంసానికి కారణమని ఆయన ఆరోపించారు. వీరు ఒకప్పటి గొప్ప దేశాన్ని ముక్కలు చేస్తున్నారని మండిపడ్డారు. మరీ ఆలస్యం కాకముందే దేశ సరిహద్దులను మూసివేసి, పరిస్థితిని నియంత్రణలోకి తీసుకురావాలని ట్రంప్ సూచించారు. విద్యారంగంలో సంస్కరణలను వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్లో కొన్ని రోజులుగా నిరసనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.