ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తమ డిమాండ్లకు టెహ్రాన్ అంగీకరించకపోతే సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆదివారమే అద్భుతమైన ఒప్పందం కుదరవచ్చని, లేదంటే దాడులు జరగవచ్చని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని, ఇందుకోసం సైనిక చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. అయితే దాడులపై నిర్దిష్ట సమయాన్ని వెల్లడించలేదు.