హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న ట్రంప్‌ డాలర్‌ కాయిన్‌

3చూసినవారు
హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న ట్రంప్‌ డాలర్‌ కాయిన్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. అమెరికా మింట్‌ 250వ వార్షికోత్సవం సందర్భంగా ట్రంప్‌ ముఖచిత్రంతో ప్రత్యేకంగా ఒక డాలర్‌ నాణెం రూపొందిస్తున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణం. నాణెంపై ఒకవైపు ట్రంప్‌ చిత్రం, లిబర్టీ, 1776 సంవత్సరం, మరోవైపు అమెరికా అధికారిక ముద్రను ముద్రించనున్నారు. 20 నాణేల రోల్‌ ధర 61 డాలర్లు, 100 నాణేల బ్యాగ్‌ ధర 154.50 డాలర్లుగా నిర్ణయించారు. అయితే జీవించి ఉన్న అధ్యక్షుడి చిత్రాన్ని కరెన్సీపై ముద్రించడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్