ఇరాన్ మ్యాప్‌పై ట్రంప్‌ ముఖం

57చూసినవారు
ఇరాన్ మ్యాప్‌పై ట్రంప్‌ ముఖం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ట్రూత్‌ సోషల్‌’లో గంట వ్యవధిలో ఏడు పోస్టులు చేసిన ఆయన.. ఇరాన్‌ మ్యాప్‌పై తన ముఖాన్ని ఔట్‌లైన్‌గా చూపిస్తూ గ్రాఫిక్‌ను పోస్ట్‌ చేశారు. ఇరాన్‌ను ‘ఫెయిలింగ్‌ నేషన్‌’గా అభివర్ణించారు. ఖర్గ్‌ ద్వీపంపై దాడి, చమురు ఎగుమతులు, హర్ముజ్‌ జలసంధిలో చమురు రవాణాపైనా పోస్టులు పెట్టారు. హర్ముజ్‌కు ‘ట్రంప్‌ స్ట్రెయిట్‌’గా పేరు పెట్టాలని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్