తమ ప్రతిపాదనలకు అంగీకరించకపోతే ఇరాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో శాంతి ఒప్పందంపై ఇరాన్ ఏడు డిమాండ్లతో అమెరికాకు ప్రతిపాదన పంపినట్లు సమాచారం. యుద్ధానికి ముగింపు, ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేత, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల,
అమెరికా సైనిక బలగాల తగ్గింపు, యుద్ధ నష్టానికి పరిహారం, దాడుల నిలిపివేత వంటివి అందులో ఉన్నట్లు ఖలీజ్ టైమ్స్ వెల్లడించింది. ఈ డిమాండ్లకు అంగీకరిస్తేనే చర్చలకు సిద్ధమని ఇరాన్ స్పష్టం చేసింది.