టీటీడీ భక్తుల సౌకర్యార్థం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, కేరళ రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల్లో కళ్యాణ మండపాలను అందుబాటులోకి తెచ్చింది. వివాహాలు, నిశ్చితార్థాలు, షష్ఠిపూర్తి, బారసాల, అన్నప్రాశనం వంటి వివిధ శుభకార్యాలను తక్కువ ఖర్చుతో నిర్వహించుకోవడానికి ఈ మండపాలను ఆన్లైన్లో ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఫంక్షన్ హాళ్లలో లక్షల్లో ఖర్చయ్యే వేడుకలను టీటీడీ మండపాలలో తక్కువ ఖర్చుతో, మెరుగైన సదుపాయాలతో జరుపుకునే అవకాశం కల్పిస్తోంది. బుకింగ్ కోసం వెబ్సైట్లో నిబంధనలను అంగీకరించి, అవసరమైన వివరాలు నమోదు చేయాలి.