తమిళనాడులో అధికార టీవీకే పార్టీ ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కళ్లకురిచి జిల్లా కలెక్టర్ జేఈ పద్మజకు అసభ్యకర సందేశాలు పంపించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై బాధిత మహిళా ఐఏఎస్ అధికారి జిల్లా ఎస్పీ సహ్యాజ్‌కు ఈనెల 23న అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు MLAను అరెస్టు చేశారు.