తమిళనాడులోని కొలత్తూరు నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే V. S బాబు (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు, నవంబర్ 14న గుండెపోటు రావడంతో కుటుంబికులు ఆసుపత్రిలో చేర్చారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు.