వికారాబాద్‌లో జంట మృతదేహాల కలకలం

27చూసినవారు
వికారాబాద్‌లో జంట మృతదేహాల కలకలం
TG: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఐనెల్లి శివారులో కుళ్లిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు లభించడంతో కలకలం రేగింది. తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతుల్లో ఒకరు పురుషుడు, మరొకరు మహిళ. మృతదేహాల వద్ద గుర్తింపు కార్డులు లభించలేదు. పురుగుల మందు డబ్బాలు లభించడంతో ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అనే దానిపై పోలీసులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్