రెండు బైకులు ఢీకొన్న ఘటన.. మృతులు వీరే

4చూసినవారు
రెండు బైకులు ఢీకొన్న ఘటన.. మృతులు వీరే
AP: అన్నమయ్య జిల్లా చౌడేపల్లె మండలంలోని చిట్రెడ్డిపల్లె వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఒకదానికొకటి ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు ఇండియన్ బ్యాంక్ ఉద్యోగి మహేశ్ (26), గోసులకురప్పల్లెకు చెందిన సంతోష్(21)గా గుర్తించారు. బైక్‌ల వెనకాల కూర్చున్న బ్యాంక్ మేనేజర్ నరేంద్ర, గోసులకురప్పల్లెకు చెందిన చంద్రశేఖర్ (18) తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్