కాకినాడలో రెండు కార్లు ఢీ.. మహిళ మృతి

20చూసినవారు
AP: కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. రాంగ్‌రూట్‌లో వేగంగా దూసుకొచ్చిన ఒక కారు, మరో కారును బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన చికిత్స కోసం వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

సంబంధిత పోస్ట్