TG: మెదక్ జిల్లాలోని మంజీరా చెక్‌డ్యామ్‌లో ప్రమాదవశాత్తు నీట మునిగి ఇద్దరు మృతి చెందారు. పాపన్నపేట మం. పొడిచన్పల్లి మంజీరా చెక్‌డ్యామ్ వద్దకు మంజుల(35), కంబాల ప్రీతి (14) అనే ఇద్దరు వెళ్లారు. అందులో ప్రమాదవశాత్తు పడటంతో నీట మునిగి వారు చనిపోయారు. నీటిలో మునిగిపోతున్న మరో ముగ్గురు పిల్లలను అక్కడ ఉన్నవారు రక్షించారు.