AP: అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. నదిలో ఇద్దరు రైతులు గల్లంతయ్యారు. గోవాడ సమీపంలోని శారదా నదిలో మునిగి అప్పారావు (54), నూకరాజు (46) గల్లంతయ్యారు. పొలానికి వెళ్లేందుకు రైతులు శారదా నదిలో దిగినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరు రైతుల మృతితో గోవాడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.