గుంటూరులో రెండు నెలల పసికందు అపహరణ

0చూసినవారు
గుంటూరులో రెండు నెలల పసికందు అపహరణ
AP: గుంటూరు జిల్లా, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏటుకూరు రోడ్డు ప్రాంతంలో నిద్రిస్తున్న తల్లి పక్కనే ఉన్న రెండు నెలల పసికందును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిద్రిస్తున్న సమయంలోనే బిడ్డను ఎత్తుకెళ్లినట్లు సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ అపహరణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్