అరుణాచల్‌లో రెండు కొత్త మొక్కల గుర్తింపు

0చూసినవారు
అరుణాచల్‌లో రెండు కొత్త మొక్కల గుర్తింపు
అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్‌ జిల్లాలో రెండు కొత్త మొక్కల జాతులను పరిశోధకులు గుర్తించారు. ‘ఓఫియోర్హిజా షిడియెన్సిస్‌’, ‘ఓఫియోర్హిజా పెమే’ పేర్లతో గుర్తించిన ఈ జాతుల వివరాలు అక్టోబర్‌ 23న ‘తైవానియా’ శాస్త్రీయ పత్రికలో ప్రచురితమయ్యాయి. వీటిని ఆకులు, పువ్వుల రంగు, నిర్మాణ లక్షణాల ఆధారంగా గుర్తించారు. మొదటి జాతికి స్థానిక లిసు సమాజం ఉపయోగించే ‘షిడి’ పేరు పెట్టగా, రెండో జాతికి అరుణాచల్‌ సీఎం పెమా ఖండు గౌరవార్థం ‘పెమే’ అని నామకరణం చేశారు.

సంబంధిత పోస్ట్