హర్ముజ్ జలసంధి వద్ద పేలిన రెండు ఆయిల్ ట్యాంకర్లు (VIDEO)

6చూసినవారు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. హర్ముజ్ జలసంధి సమీపంలో నౌకాదళ మైన్లను ఢీకొని రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ అనుమతి లేకుండా, రాడార్లు నిలిపివేసి ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) వెల్లడించింది. పేలిన నౌకల్లో ఒకటి సూపర్ ట్యాంకర్ కాగా, దాని నుంచి ఎగసిపడుతున్న మంటలు తీర ప్రాంతం వరకు కనిపిస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్