ఆర్మేనియాలోని ఒక టీవీ డిబేట్ కార్యక్రమం సందర్భంగా పొలిటికల్ అనలిస్ట్ హరుథిన్, జర్నలిస్ట్ బోరిస్ మారుజి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చర్చ వేడెక్కడంతో వీరిద్దరూ వ్యక్తిగత దూషణలకు దిగారు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఇద్దరూ ఒకరిపై ఒకరు భౌతిక దాడికి పాల్పడ్డారు. సెట్లో ఉన్న యాంకర్లు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.