ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

5చూసినవారు
ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
TG: సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో విషాదం చోటు చేసుకుంది. ముకుందాపురం ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. అనుదీప్​, హరీశ్‌నాయుడు, స్వరూప్ అనే ముగ్గురు విద్యార్థులు కెనాల్‌లో ఈతకు వెళ్లి కాలువలో కొట్టుకుపోయారు. వీరిలో అనుదీప్​ అనే విద్యార్థిని స్థానికులు కాపాడగా హరీశ్‌నాయుడు, స్వరూప్ చనిపోయారు.

సంబంధిత పోస్ట్