TG: సూర్యాపేట జిల్లా చివ్వేంల గురుకుల పాఠశాలకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బీబీగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యాపేట నుంచి విధులకు వెళ్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రజిత, టీచర్ గుగులోతు రక్మ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో పాఠశాల వర్గాల్లో విషాదం నెలకొంది, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.