TG: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలోని ఓ పరిశ్రమలో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సరాక పరిశ్రమ బ్లాక్‌లో జరిగిన ఈ గ్యాస్ లీకేజీ ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుదర్శన్ మరియు బాలాజీగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.