కర్ణాటకలోని మాగడి తాలూకా గుడెమారనహళ్లి సమీపంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థినులు మరణించారు. బెంగళూరు నుంచి కుణిగల్కు వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో జాహ్నవి, వైష్ణవి అనే విద్యార్థినులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్న కూడూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.