
ఆయుష్మాన్ కార్డు అప్డేట్.. ఇక ఇంటి నుంచే ఈ-కేవైసీ పూర్తి
ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారులు ఇకపై తమ ఈ-కేవైసీని అధికారిక 'ఆయుష్మాన్ యాప్' ద్వారా ఇంటి నుంచే సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ ఓటీపీ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. తప్పుడు వివరాలు ఉంటే చికిత్సలో ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు పేర్కొన్నారు. కేవైసీ పూర్తయ్యాక, లబ్ధిదారులు కొత్త కార్డును పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స కోసం ఈ ప్రక్రియ తప్పనిసరి అని నేషనల్ హెల్త్ అథారిటీ స్పష్టం చేసింది.




