ఐరోపాలో పొడవైన వంతెనపై ఉక్రెయిన్‌ దాడి

0చూసినవారు
ఐరోపాలో పొడవైన వంతెనపై ఉక్రెయిన్‌ దాడి
రష్యా, క్రిమియాలను అనుసంధానించే ఐరోపాలోని అత్యంత పొడవైన కెర్చ్‌ వంతెనపై ఉక్రెయిన్ దాడులు చేసింది. ఈ దాడి కారణంగా వంతెనపై రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని క్రిమియా గవర్నర్ సెర్గీ అక్స్యానోవ్ తెలిపారు. అయితే వంతెనకు జరిగిన నష్టంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ వంతెనపై 2022లో యుద్ధం మొదలైనప్పటి నుండి ఉక్రెయిన్ అనేకసార్లు దాడులకు పాల్పడింది. ఈ ఘటన రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్