కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన (వీడియో)

7చూసినవారు
అపోలో ఆస్పత్రుల డైరెక్టర్ ఉపాసన కన్నీళ్లు పెట్టుకున్నారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ అపోలో ఆస్పత్రిలో ‘అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్’ను ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నా తొలి గర్భధారణ సమయంలో సమస్యలు ఎదురుకాలేదు. రెండోసారి కవలలకు జన్మనిచ్చాక మానసిక, శారీరక సమస్యలు నన్ను ఇబ్బంది పెట్టాయి. నరకం చూశాను’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్