
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు.. అక్టోబర్ 15 నుంచే అమలు
యూపీఐ (UPI) ద్వారా జరిగే పెద్ద మొత్తాల వ్యాపార లావాదేవీలపై అక్టోబర్ 15 నుంచి ఎండీఆర్ (MDR) రుసుము విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే సాధారణ పీ2పీ (P2P) సేవలు, రూ.2,000 లోపు వ్యాపార చెల్లింపులకు మినహాయింపునిచ్చింది. రూ.2,000 దాటిన రైల్వే, పెట్రోల్, బిల్లులు, ఫీజుల చెల్లింపులకు ఫ్లాట్గా రూ.5, మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్ చెల్లింపులపై 0.02% (గరిష్టంగా రూ.300) చార్జీ వర్తిస్తుందని తెలిపింది.




