శాంతి చర్చల వేళ ఇరాన్‌పై అమెరికా దాడి

19చూసినవారు
ఇరాన్‌తో శాంతి చర్చలు జరుగుతున్న వేళ కిషమ్‌ (ఖేష్మ్‌) దీవిపై అమెరికా క్షిపణి దాడికి పాల్పడినట్లు సమాచారం. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించగా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కూడా చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఇరాన్‌పై దాడులు చేయాలని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు అమెరికాపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అమెరికా క్షిపణి దాడి తాత్కాలిక కాల్పుల విరమణ వాతావరణాన్ని దెబ్బతీసిందని, అంతర్జాతీయ చమురు మార్కెట్లు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్