ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లపై
అమెరికా క్షిపణులతో దాడి చేసింది. ఖర్గ్ ద్వీపానికి సమీపంలో, ఒమన్ గల్ఫ్లోని జాక్స్ వద్ద ఈ దాడి జరిగింది. తమ నౌకలపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించిన నేపథ్యంలోనే ఈ ప్రతీకార చర్య తీసుకున్నట్లు
అమెరికా అధికారులు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో
అమెరికా దళాలున్న కువైట్, బహ్రెయిన్లోని ఆయిల్ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఆ ట్యాంకర్లలోని సిబ్బంది వెంటనే వెళ్లిపోవాలని ఇరాన్ హెచ్చరించింది.